రవితేజ నటించిన ఈగల్ చిత్రం ఇటీవలే విడుదలై థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. కానీ రవితేజ మాత్రం విరామం తీసుకోకుండా తన తదుపరి సినిమా మిస్టర్ బచ్చన్ షూటింగ్‌లో బిజీ అయిపోయారు. హరీశ్‌శంకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం అదే లొకేషన్లో ఈగల్ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు. మిస్టర్ బచ్చన్ లో రవితేజ పూర్తి భిన్నమైన లుక్‌తో కనిపించనున్నారని, ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా మిస్టర్ బచ్చన్ అవు తుందని మేకర్స్ తెలిపారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీజె.మేయర్ సంగీతం సమకూరుస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభోట్ల.