సాయిరామ్ శంకర్ హీరోగా వినోద్ విజయన్ తెరకెక్కించిన చిత్రం ఒక పథకం ప్రకారం. అశీమా నర్వాల్ కథానాయిక. ఈ నేపథ్యంలో హీరో రవితేజ టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ మంచి వైవిధ్యభరితమైన కథతో రూపొందిన చిత్రమిది. ఇందులో రామ రావణ తరహా పాత్రలో సాయిరామ్ కనిపిస్తారు. ఆయన లుక్ నటన చాలా కొత్తగా ఉంటాయి. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం అన్నారు. ఈ సినిమాలో శృతి సోధి, సముద్రఖని, భానుశ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రవి పచ్చముత్తు, గార్లపాటి రమేష్, వినోద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా జూన్ 24న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: రాహుల్ రాజ్, ఛాయాగ్రహణం: రాజీవ్ రవి, వినోద్, సురేష్ రాజన్.
