Skip to main content

Namaste NRI

ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి లతో రవితేజ వామ్మో వాయ్యో సాంగ్

రవితేజ కథానాయకుడిగా తిరుమల కిశోర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న వినోదాత్మక కుటుంబకథా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. అషికా రంగనాథ్‌, డింపుల్‌ హయాతి కథానాయికలు. శ్రీనివాస్‌ చెరుకూరి నిర్మాత. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి వామ్మో.. వాయ్యో.. ఒల్లెంకలో.. నేనేం సేత్తూ సొల్లెంకలో అంటూ తెలంగాణ జానపద శైలిలో సాగే పాటను వరంగల్‌లో విడుదల చేశారు.

దేవ్‌ పవార్‌ రాసిన ఈ పాటను భీమ్స్‌ సిసిరోలియో స్వరపరచగా, స్వాతిరెడ్డి ఆలపించారు. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ ఈ పాటకు హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. రవితేజ, అషికా రంగనాథ్‌, డింపుల్‌ హయాతి పై ఈ పాటను చిత్రీకరించారు. ముగ్గురి మధ్య కెమిస్ట్రీ డ్యాన్స్‌ ఫ్లోర్‌ను దద్దరిల్లేలా చేసిందని మేకర్స్‌ పేర్కొన్నారు. మాస్‌కి విపరీతంగా నచ్చే పాట ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ల, నిర్మాణం: ఎస్‌ఎల్వీ సినిమాస్‌.

Social Share Spread Message

Latest News