మిట్టకంటి రామ్, విజయ్ శంకర్ కథానాయకులుగా నటించిన చిత్రం 2020 గోల్‌మాల్. అక్షత మహి మల్హోత్రా, కిస్లే చౌదరి కథానాయికలు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కోల్పోయిన ప్రేమ తాలూకు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటే జరిగే పరిణామాల నేపథ్యంలో సాగే కథ ఇది. కుటుంబమంతా కలిసి చూసేలా సస్పెన్స్, కామెడీతో ఉంటుంది. కథానాయికలు, ఇతర నటులు పాత రోజుల తరహా వేషధారణతో కనిపిస్తారు. ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల మనసుల్ని గెలుస్తుంది అన్నారు. 2020 చిత్రాన్ని నూతన దర్శకుడు జాన్ జక్కి తెరకెక్కించారు. కేకే చైతన్య నిర్మాత. ఈ సినిమాని ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జగన్.ఎ, సంగీతం: కనిష్క.














