పాకిస్తాన్, పీవోకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలో భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు మద్దతు ప్రకటించారు. అవసరమైతే జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఇరుదేశాలు ఉద్రిక్తతలు తగ్గిస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

భారత్-పాక్‌ల దాడులు భయంకరంగా ఉన్నాయన్నారు. తనకు రెండుదేశాలతో మంచి సంబంధాలున్నాయని, తనకు వారి గురించి బాగా తెలుసునన్నారు. ఇద్దరు శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకొని దాడులను ఆపాలని తాను కోరుకుంటున్నారన్నారు. తక్షణం దాడులను ఆపుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. రెండుదేశాలు పరస్పరం దెబ్బతీసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఏదైనా సహాయం చేయగలిగితే అందుబాటులో ఉంటానన్నారు.
