Namaste NRI

భారత్ కు ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధం  

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం  పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయ్యిందని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇది ఒక భయంకరమైన ఘటను అని పేర్కొన్నారు. ట్రంప్ ప్రమాద తీవ్రతను గుర్తుపరిచి, బాధితులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

భారతదేశానికి అవసరమైతే  తాను ఏవిధమైన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అమెరికా భారత ప్రజలతో కలిసి ఉంది అని స్పష్టం చేశారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడంలో భారతదేశం సత్తా ఉన్న దేశమని ట్రంప్ కొనియాడారు. భారత్ చాలా బలమైన దేశం. ఇలాంటి సంఘటనలను ఎలా ఎదుర్కోవాలో, ఎలా నిర్వహించాలో ఆ దేశానికి బాగా తెలుసు అంటూ భారత ప్రభుత్వానికి తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సందేశం భారత ప్రజల్లోకి మద్దతు కలిగించడంతోపాటు, అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు మిత్రదేశాల మద్దతు ఎలా ఉందనేది స్పష్టమవుతోంది.

Social Share Spread Message

Latest News