చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం రికార్డ్ బ్రేక్. చదలవాడ పద్మావతి నిర్మాత. నిహార్, నాగార్జున, రగ్థా ఇఫ్తాకర్ ముఖ్య పాత్రధారులు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ఘనంగా జరిపారు. సీనియర్ దర్శకుడు అజయ్‌కుమార్, సీనియర్ నిర్మాత రామసత్యనారాయణ, నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ అడవిరాముడు, వేటగాడు, దేవదాసు చిత్రాల ప్రేరణతో సినీరంగం లోకి అడుగుపెట్టాను. సమాజానికి ఉపయోగపడే కథతో సినిమా తీయాలనేది నా కోరిక. ఆ కోరిక నుంచి పుట్టు కొచ్చిన కథే రికార్డ్ బ్రేక్. ఇందులో హీరో ఎవరూ ఉండరు. కథే హీరో. ఆర్ట్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఈ ముగ్గురు కూడా హీరోలే. చివరి 45 నిమిషాలు ఎమోషనల్‌గా ఉంటుంది. కచ్చితంగా అన్నిభాషల్లో నూ వండర్ క్రియేట్ చేస్తుంది అని నమ్మకం వెలిబుచ్చారు. లాస్ట్ 45 నిమిషాలు ఈ సినిమా మంచి ఎమోషన ల్‌గా ఉంటుంది. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చే సినిమా అవుతుంది అని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)