పాకిస్థాన్‌కు చెందిన సారా గిల్ దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్‌గా రికార్డు సృష్టించింది. సారా గిల్ కరాచీలోని జిల్లా మెడికల్ అండ్ డెంటల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ చివరి సంత్సరం పరీక్షలల్లో ఉత్తీర్ణురాలైంది. ప్రస్తుతం ఆమె పాక్‌లో ట్రాన్స్‌జెండర్ల కోసం పని చేస్తున్న ఎన్జీవోతోనూ సంబంధాలున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్‌గా నిలువడం గర్వంగా ఉందన్నారు. ఎన్జీవో సహాయంతో టాన్స్‌జెండర్ల కోసం పని చేస్తూనే ఉంటానని తెలిపింది. జీవితంలో కష్టాలు వస్తాయి. మీకు అభిరుచి ఉంటే, మీ అడుగులను ఎవరూ ఆపలేరు. మీరు ఖచ్చితంగా విజయం వైపు ప్రయాణిస్తారని పేర్కొంది. సమాజం ఒత్తిడితో పాక్‌లో తల్లిదండ్రులు లింగమార్పిడి పిల్లలను ఇండ్ల నుంచి ఎలా వెళ్లగొడుతారో చెప్పిన ఆమె వాటిని ఆపాలని సమాజానికి విజ్ఞప్తి చేసింది.