Namaste NRI

రికార్డులు బద్దలుకొట్టిన అనోరా

 సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్‌. ఈ అత్యున్నత అవార్డును ఒక్కసారైనా అందుకోవాలని ప్రతీ నటుడు, ఆర్టిస్ట్‌, టెక్నీషన్‌ అనుకుంటూ ఉంటారు. అలాంటి అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజిల్స్‌లో గల డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా సాగింది. ఈ వేడుకకు సినీ తారలతోపాటు టెక్నీషియన్స్‌ హాజరయ్యారు. ఉత్తమ సహాయ నటుడితో మొదలైన అవార్డుల ప్రదానోత్సవం బెస్ట్‌ పిక్చర్‌తో ముగిసింది.

ఈ ప్రతిష్టాత్మక ఆస్కార్‌ వేడుకల్లో అనోరా  అనే రొమాంటిక్‌ చిత్రం పేరు మార్మోగిపోయింది. ఆస్కార్‌ వేదికపై దాదాపు ఐదు విభాగాల్లో విజయాన్ని అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ ప్లే, ఉత్తమ ఎడిటింగ్‌ విభాగాల్లో పురస్కారాలను అందుకుంది. రెడ్‌ రాకెట్‌, ది ఫ్లోరిడా ప్రాజెక్ట్‌ వంటి చిత్రాలను తీసిన సీన్‌ బేకర్‌  అనోరా కు దర్శకత్వం వహించారు. మైకీ మ్యాడిసన్‌ , మార్క్ ఎడిల్జియన్‌, యురా బోరిసావ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. గతేడాది అక్టోబర్‌ నెలలో ఇది విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events