Namaste NRI

బ్రేకింగ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైన రెజీనా

వెండితెరపై బ్రేకింగ్‌ న్యూస్‌ ను బ్రేక్‌ చేయడానికి రెడీ అయ్యారు హీరోయిన్‌ రెజీనా. అయితే ఈ బ్రేకింగ్‌ న్యూస్‌ ఏ అంశానికి సంబంధించినది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. రెజీనా కసాండ్ర, సుబ్బరాజు,  జెడీ చక్రవర్తి, రaాన్సీ, సురేశ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా బ్రేకింగ్‌ న్యూస్‌.  ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సోషల్‌ సెటైరికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రూపొందుతున్న సినిమా ఇది. డిసెంబర్‌ మూడో వారం  వరకూ షూటింగ్‌ ప్లాన్‌ చేశాం అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.  సుబ్బు వేదుల ఈ చిత్రానికి దర్శకుడు. రా ఎంటర్‌టైన్మెంట్స్‌, మ్యాంగో మాస్‌ మీడియా నిర్మిస్తుంది. ఈ సినిమాకు కథ, మాటలు: బీవీఎస్‌ రవి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కౌముది నేమని.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events