Namaste NRI

షికాగోలో రిలే నిరాహారదీక్ష

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా అమెరికాలోని షికాగోలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు రిలే నిరాహారదీక్ష చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు దీక్షలో కూర్చొని చంద్రబాబుకు సంఫీుభావం ప్రకటించారు. యుగంధర్‌ యడ్లపాటి నిమ్మరసం ఇచ్చి రిలే నిరహారదీక్షని విరమింపజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ అభివృద్ధి ఎలా  జరిగిందో గుర్తు చేసుకున్నారు. తద్వారా తాము అమెరికా రావడానికి ఆయన ఎలా కారణమయ్యారో వివరించారు. లక్షల  మందికి సాఫ్ట్‌వేర్‌ రంగంలో శిక్షణ ఇచ్చి, వేలమంది యువతకు ఉద్యోగాలు కల్పించిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందనడం కేవలం ఆరోపణలు మాత్రమే అన్నారు. ఆధారాలు లేకుండా, కేవలం వ్యక్తిగత కక్షతోనే కేసు పెట్టారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వ్యవస్థలను భ్రస్టు పట్టించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్నారు.

చంద్రబాబు అరెస్టుతో షికాగోలోని ఆయన అభిమానులు ఆందోళన చెందారు. ఆ రోజు నుంచి ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఆధ్వర్యంలో పలువురు వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వీరి దీక్షకు జనసేన అభిమానులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో  హేమ కానూరు, రవి కాకర, హను చెరుకూరి, విజయ్‌ కొరపాటి, రఘు చిలుకూరి, చిరంజీవి గల్లా, హరీశ్‌ జమ్ముల, శ్రీనివాస్‌ అట్లూరి, మహేష్‌ కాకరాల, మూర్తి కొప్పాక, సతీష్‌ వీరపనేని, వినోజ్‌ చనుమోలు, మురళి కలగార, సతీష్‌ యలమంచిలి, అశోక్‌ పరుచూరి, శ్రీహర్ష గరికిపాటి, శివ, మహేష్‌, త్రివేది, శశి, ప్రకాష్‌, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events