Namaste NRI

తొలి భాగానికి దీటుగా విడుదల 2

వెట్రిమారన్‌ దర్శకత్వంలో రూపొందిన విడుదల చిత్రం గత ఏడాది విడుదలై తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నది. ఆ సినిమా సెకండ్‌ పార్ట్‌ కోసం ఆడియన్స్‌ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. విడుదల క్లైమాక్స్  లో ప్రవేశించే విజయ్‌ సేతుపతి పాత్ర విడుదల 2 లో ప్రధానంగా సాగుతుందని మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ఎంతోమంది నిర్మాతలు పోటీపడగా, నిర్మాత చింతపల్లి రామారావు ఫ్యాన్సీ రేటుకు ఈ సినిమాను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు జాతీయ అవార్డులు అందుకున్న ఏకైక దర్శకుడు వెట్రిమారన్‌. ఆయన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది. విజయ్‌ సేతుపతి నట విశ్వరూపాన్ని ఇందులో చూస్తారు  అని అన్నారు. డిసెంబర్‌ 20న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News