Skip to main content

Namaste NRI

మిస్టికల్ థ్రిల్లర్ అగాధ రిలీజ్ డేట్ ఖరారు

టాలీవుడ్ ప్రముఖ సీనియర్ దర్శకుడు, నిర్మాత ఎం.ఎస్. రాజు సరికొత్త జోనర్‌లో తెరకెక్కిస్తున్న మిస్టికల్ థ్రిల్లర్ మూవీ అగాధ. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం, ఎం.ఎస్. రాజు కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఇందులో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, జోవిక విజయ్‌కుమార్, ఉల్కా గుప్తా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం నుంచి నుంచి చిత్ర బృందం అగాధ విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఎం.ఎస్. రాజు స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందించి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ ఆది వరాహ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పాన్-ఇండియా స్థాయిలో భారీగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా కథను సస్పెన్స్‌గా ఉంచినప్పటికీ, టీజర్ ద్వారా ఒక సరికొత్త మిస్టరీ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఫాంటసీ అంశాలతో కూడిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, రాబోయే రోజుల్లో చిత్ర ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుక‌గా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events