Skip to main content

Namaste NRI

కామ్రేడ్‌ కల్యాణ్‌ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

వినోదప్రధానంగా సినిమాలు చేస్తూ వినూత్న కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం కామ్రేడ్‌ కల్యాణ్‌. జానకీరామ్‌ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలిపాటను ఈ నెల 20న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

యాక్షన్‌, వినోదం ప్రధానంగా నడిచే ప్రేమకథా చిత్రమిదని, నేటికి ట్రెండ్‌కి తగినట్లుగా ఉంటూ యువతను ఆకట్టుకుంటుందని మేకర్స్‌ తెలిపారు. మహిమా నంబియార్‌, రాధిక శరత్‌కుమార్‌, షైన్‌ టామ్‌ చాకో, ఉపేంద్ర లిమాయే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, సమర్పణ: కోన వెంకట్‌ దర్శకత్వం: జానకీరామ్‌ మారెళ్ల.

Social Share Spread Message

Latest News