రుత్విక్, విశాఖ దీమన్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రాజా ది రాజా. అనిల్ బోయిడపు దర్శకుడు. కె.నిహారిక దాసరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని కె.శ్రీలతారెడ్డి సమర్పిస్తున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం విశేషం.

ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ కలర్‌ఫుల్ విజువల్స్‌తో రొమాంటిక్ మూడ్‌ని ప్రజెంట్ చేస్తున్నది. డా.నరేష్ విజయకృష్ణ, సాయికుమార్, అవసరాల శ్రీనివాస్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జూలై 17న సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రానికి కెమెరా: రవికిరణ్ బోయిడపు, సంగీతం: మార్క్ కె.రాబిన్, నిర్మాణం: బృందావన్ క్రియేషన్స్.





























