Skip to main content

Namaste NRI

రవితేజ ఇరుముడి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

రవితేజ నటిస్తున్న ఎమోషనల్‌ యాక్షన్‌ డ్రామా ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. అంకితభావం గల మధ్యతరగతి తండ్రిగా ఈ సినిమాలో రవితేజ కనిపిస్తారని, ఆయన నటన ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, భక్తి, భావోద్వేగాలు, యాక్షన్‌ అంశాల మేళవింపుగా రానున్న ఈ చిత్రం అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటుందని మేకర్స్‌ తెలిపారు.

దర్శకుడు శివ నిర్వాణ రాసిన ఈ కథ మానవసంబంధాలు, కుటుంబ విలువల నేపథ్యంలో సాగుతుందని, వాణిజ్య అంశాలు కూడా బలంగానే ఉంటాయని చిత్రబృందం చెబుతున్నది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతున్నది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రియ భవాని శంకర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తున్నది. సాయికుమార్‌, అజయ్‌ఘోష్‌, రమేశ్‌ ఇందిర, స్వాసిక ఇతర పాత్రధారులు. ఈ చిత్రం ఆగస్ట్‌ 21న ప్రపంచవ్యాప్తంగా పానిండియా స్థాయిలో విడుదల కానున్నది. ఈ చిత్రానికి కెమెరా: విష్ణుశర్మ, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌.

Social Share Spread Message

Latest News