Skip to main content

Namaste NRI

వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్లలోకి వచ్చేది ఆ రోజే

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కొరియన్‌ కనకరాజు. రితికా నాయక్‌ కథానాయిక. ఇండియన్‌-కొరియన్‌ కల్చర్‌ కలబోతగా హారర్‌ కామెడీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం. ఈ చిత్రానికి రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో వరుణ్‌తేజ్‌ ఓ చేతిలో కత్తి, మరో చేతిలో గ్రెనేడ్‌ పట్టుకొని రఫ్‌ అండ్‌ అల్ట్రా ైస్టెలిష్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. కొరియన్‌ గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ కథలో వరుణ్‌తేజ్‌ పాత్ర కొత్త పంథాలో ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 7న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, రచన-దర్శకత్వం: మేర్లపాక గాంధీ.

Social Share Spread Message

Latest News