Namaste NRI

రంగమార్తాండ నుండి బ్రహ్మానందం గ్లిమ్స్ విడుదల

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం పుట్టినరోజును పురస్కరించుకొని రంగమార్తాండ చిత్రం నుంచి ఆయన ఫస్ట్ గ్లింప్స్ను విడుదల చేశారు. రంగస్థల కళాకారుల జీవితాలు, వారి జీవన సంఘర్షణ నేపథ్యంలో దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.  ఫస్ట్గ్లింప్స్లో బ్రహ్మానందం ఆసుప్రతి మంచం మీద స్లైన్ పెట్టుకొని విషాదంగా కనిపిస్తున్నారు. కన్నీటి పర్యంతమవుతూ ఆయన చెప్పిన సంభాషణ ఉద్వేగంగా సాగింది. సుయోధన సౌర్వభౌమ శరా ఘాతాలతో ఛిద్రమై..ఊపిరి ఆవిరై..దిగంతాల సరిహద్దులు చెరిగిపోతున్న వేళ  అంటూ గద్గద స్వరంతో బ్రహ్మానందం చెప్పిన సంభాషణ అందరిని ఆకట్టుకుంటున్నది.  ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల రంగమార్తాండ సినిమా నుండి మెగాస్టార్ చిరంజీవి చెప్పిన షాయిరీ అలాగే రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ సాంగ్ నన్ను నన్నుగా కు మంచి స్పందన లభిచింది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాకు ఆకెళ్ల శివప్రసాద్ సంభాషణలు అందించగా లక్ష్మీ భూపాల, కాకర్ల శ్యామ్, భల్లా విజయ కుమార్ సాహిత్యం అందించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events