రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యుత్తమ ఎంప్లాయర్ కంపెనీగా నిలిచింది. ఈ మేరకు బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్ 2021 నివేదికను వెల్లడిరచింది. ప్రపంచంలోని అత్యుత్తమ యాజమన్యాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు భారతదేశంలోని 19 కంపెనీలకు చోటు లభించింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ అత్యుత్తమ యాజమాన్యాల జాబితాలో దేశంలో మొదటి స్థానంలో, ప్రపంచ స్థాయిలో 52వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 750 పెద్ద కంపెనీలను ఈ జాబితాలో చేర్చారు. భారతదేశం నుంచి మొత్తం 19 కంపెనీలకు ఈ జాబితాలో చోటు లభించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)