Namaste NRI

అమెరికాలో భారతీయ విద్యార్థులకు ఊరట

భారతీయులు సహా 133 మంది విదేశీ విద్యార్థుల వీసాలను తాత్కాలికంగా పునరుద్ధరిస్తూ జార్జియాలోని అమెరికా ఫెడరల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరి సేవిస్‌ (స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌) రికార్డులను పునరుద్ధరించాలని న్యాయమూర్తి ఆదేశించారు. వీసా పునరుద్ధరణలు పొందిన విద్యార్థులలో భారతీయులే అధిక సంఖ్యలో ఉన్నారు. విదేశీ విద్యార్థుల వీసాలను, సేవిస్‌ రికార్డులను అమెరికా విదేశాంగ శాఖ (డిఒఎస్‌), ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసిఇ) రద్దు చేయడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.

విద్యార్థులు చట్టాలను ఉల్లంఘించినందునే వారి వీసాలు రద్దు చేశామని అమెరికా చెబుతోంది. అయితే వీరిలో చాలా మందికి ఎలాంటి నేర చరిత్ర లేదు. న్యాయస్థానం ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలు విద్యార్థులకు ఎంతో ఊరట ఇస్తున్నాయి. వీరి వీసాలు రద్దు చేయడం అన్యాయమని, తీవ్రత లేని కారణాలతో వీరిపై చర్యలు చేపట్టారని ఇమ్మిగ్రేషన్‌ న్యాయవాదులు తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో క్యాచ్‌ అండ్‌ రివోక్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత వీసాల రద్దు మొదలైంది. విద్యార్థి వీసాలు ఉన్న వారిని కృత్రిమ మేధ సాయంతో తనిఖీలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కింద 300కు పైగా వీసాలు రద్దు చేశామని రూబియో గతంలో ప్రకటించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events