ధర్మ, అమ్ము అభిరామి, చాందినీ రావు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం రణస్థలి. సూరెడ్డి విష్ణు సమర్పణలో అనుపమ సూరెడ్డి నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్వినీదత్ మాట్లాడుతూ రణస్థలి టీజర్, ట్రైలర్ చూస్తుంటే ఇంద్ర సినిమా గుర్తుకు వస్తోంది. ఇందులోని కొన్ని సీన్స్ చూసిన తర్వాత సినిమా హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది అని అన్నారు. విజయా పిక్చర్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా 50 ఏళ్లు నడిపిన వెంకటరత్నం గారి అబ్బాయి విష్ణు సినిమా రంగంలోకి రావడం సంతోషంగా ఉంది అన్నారు. ఈ సినిమాలో నటీనటులు కొత్తవారే అయినా అద్భుతంగా నటించారు అన్నారు సూరెడ్డి విష్ణు, సహ నిర్మాత లక్ష్మీజ్యోతి శ్రీనివాస్. పూరి జగన్నాథ్‌గారు నా గురువు. రొటీన్‌గా వచ్చే కథలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది అన్నారు పరశురాం శ్రీనివాస్. ఈ వేడుకల్లో హీరోలు ఆకాష్ పూరి, నందు, గౌతమ్, నటుడు సమ్మెట గాంధీ, కెమెరామేన్ బాలాజీ, చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కేశవ్ కిరణ్, కెమెరా : జాస్తి బాలాజీ, సమర్పణ: సూరెడ్డి విష్ణుగారి, నిర్మాణ సంస్థ : ఏజే ప్రొడక్షన్స్, దర్వకత్వం: పరశురాం శ్రీనివాస్.
