భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఇజ్రాయిల్‌లో పర్యటించారు. ఇజ్రాయిల్ పర్యటనలో ఉన్న మంత్రి జై శంకర్‌ను ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి సమస్యలను విన్నవించారు. ఇజ్రాయెల్‌లో ఏ రకమైన వీసా లేకపోయినా కూడా అవసరమైన వారందరికీ పాస్‌పోర్టు రెన్యువల్ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. వాల్యూడ్ పాస్‌పోర్ట్ ఉంటే లీగల్‌గా పని చేసుకోవడానికి అవకాశవముందని, దీంతో వందలాది మందికి ఇక్కడ ఉండి పని చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఐటీ, కేర్ టేకర్ మాదిరిగానే హోటల్, అగ్రికల్చర్, కన్‌స్ట్రక్సన్ రంగాలలో కూడా వీసాలు ఇండియా వారికి ఇచ్చేలా చూస్తే వేలాది మంది భారతీయులకు ఉపాధి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇజ్రాయెల్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమ రవి, కమిటీ ప్రతినిధులు గురం సురేశ్, ఎల్ల ప్రసాద్, జి.సందీప్‌గౌడ్, దేవరాజ్, ముంబై వివేక్, కరణ్‌గౌడ్, దేగాం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)