Namaste NRI

జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణకు సుప్రీంకోర్టులో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ జీవితంలో తనకు విద్య నేర్పిన గురువులకు, స్ఫూర్తినిచ్చిన వారికి రుణపడి ఉంటానని అన్నారు. తన జీవితంలో ఎదురైన అనేక విషయాలను గుర్తు చేసుకున్నారు. 12 ఏళ్ల వయసులో తొలిసారి కరెంటు చూసినట్లు పేర్కొన్నారు. 17 ఏళ్లకు ట్రేడ్‌ యూనియన్‌కు నేతృత్వం వహించానని తెలిపారు.  ఈ వృత్తిలో అనేక ఒడిదొడుకులు  వస్తాయని న్యాయవాదులు గ్రహించాలని సూచించారు. కనీస వసతులు లేని గ్రామం నుంచి తన ప్రస్థానం మొదలైందని, వృతి పరంగా జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని తెలిపారు. తాను గొప్ప జడ్జీని కాకపోవచ్చు  కానీ, సామాన్యుడికి న్యాయం అందించడానికి కృషి చేశానని స్పష్టం చేశారు.

                జస్టిస్‌ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా విశేష సేవలు అందించారు. 13 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా రమణ పని చేశారు. ఆ తరువాత ఢల్లీి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యామూర్తిగా ఎదిగారు. 2021 ఏప్రిల్‌ 24 నుంచి సీజేఐగా ఎన్వీ రమణ కొనసాగుతున్నారు. 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ యూయూ లలిత్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.            

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events