టీడీపీ అధినేత చంద్రబాబును తప్పుడు కేసులతో వేధించడం బాధాకరమని సౌదీ అరేబియాలోని అరంకో రిఫైనరీ సాంకేతిక బృందంలో పని చేస్తున్న ఎన్‌ఆర్‌ఐలు అందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యను ఖండించిన వారు… చంద్రబాబు ప్రవేశపెట్టిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నందు శిక్షణ పొందిన తాము నేడు సౌదీలో సంతోషంగా ఉద్యోగాలు చేసుకుంటున్నామని అందుకు కారణమైన చంద్రబాబుపై నేడు ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు.
ముఖ్యమంత్రి జగన్‌కు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ తప్పనిసరిగా ఇస్తామని వారు స్పష్టం చేశారు. అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు ఆత్మస్థైర్యాన్ని, టీడీపీ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే అది జగన్ పిచ్చితనమే అవుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ సత్తా చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, నరసింహారావు, వెంకట్రావు, క్రిష్ణ, రఫీ, లాల్ బాబు, అంటోని, రమణ, పుల్లారావు, చంద్రశేఖర్, శ్రీనివాస్ తదరితరులు ఉన్నారు.