తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మద్దతుగా అమెరికాలోని వివిధ ప్రాంతాల్లోనూ టీడీపీ శ్రేణులు, అభిమానులు, కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. వాషింగ్టన్ డీసీలో మెట్రో ప్రాంతంలో విద్యుత్ దీపాలను ఆపేసి, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్‌లు వెలిగించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి భాను మాగులూరి, యాష్ బొద్దులూరి, సుధీర్ కొమ్మి సమన్వయకర్తఉలగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధికి చిరునామాగా నిలిచిందన్నారు. పక్క రాష్ట్రాలు అభివృద్ధి చెందుతుంటే మన రాష్ట్రాన్ని అవివేకంతో, అసమర్థ పాలనతో దిగజార్చారన్నారు. ప్రజలు మేల్కొని సమర్థుడైన నాయకుడి చేతికి పాలన అందించాలని కోరారు.
ప్రజా వేదిక కూల్చివేత నుంచే వైసీపీ కక్ష సాధింపు పాలన మొదలైందని విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై నిరాధారమైన కేసులు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వం ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేసిందా? అని ప్రశ్నించారు. అప్పల బన్ నొక్కడానికి ముఖ్యమంత్రి పదవి అవసరమా? అని నిలదీశారు. అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇవ్వటం కంటే ఆంధ్రప్రదేశ్‌కు అవమానం ఏముంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నీలిమ చనుమోలు, చకవర్తి, సురేష్, అమ్మిరాజు, రామకృష్ణ, యువ సిద్ధార్థ్, సామంత్ , సురేఖ చనుమోలు, గోపాల్ శీలంనేని, రమేష్ అవిర్నేని, దుర్గా ప్రసాద్ కూచిపూడి, రమేష్ గుత్తా, వీర నారాయణ, నెహ్రు తదితరులు పాల్గొన్నారు.