
అగ్ర కథానాయిక కీర్తి సురేష్ రివాల్వర్ రీటా చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది. దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 27న రివాల్వర్ రీటా సందడి చేయబోతున్నది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ సందర్భంగా కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో కీర్తి సురేష్ చేసిన పోరాటాలు, పండించిన కామెడీ హైలైట్‌గా నిలిచాయి. తన కెరీర్‌లో ఇదొక వైవిధ్యమైన చిత్రమని, ఇందులో తొలిసారి యాక్షన్ ఎపిసోడ్స్ చేశానని కీర్తి సురేష్ చెప్పింది.
