Namaste NRI

ఆర్జీవీ కొండా ట్రైలర్ విడుదల

శ్రేష్ఠా పటేల్‌ మూవీస్‌ బ్యానర్‌పై రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్‌ బయోపిక్‌ కొండా సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హనుమకొండలో జరిగింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావుతో కలిసి ఆర్జీవీ ట్రైలర్‌ విడుదల చేశారు.  ఈ సందర్భంగా నటీనటులు మాట్లాడుతూ ఆర్జీవీ దర్శకత్వంలో కొండా మురళీ, సురేఖ పాత్రలు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో తమకు అభిమానులు పెరిగారని సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మాట్లాడుతూ కొండా మురళీపై చిత్రం చేయడానికి మొదట ఆలోచించానని, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత అయిదారు సినిమాలు తీసినా సరిపోవని తెలిపారు. మార్చిలో విడుదల చేస్తామని తెలిపారు. కొండా`2 నూ నిర్మిస్తామని తెలిపారు. కొండా సురేఖ మాట్లాడుతూ తమ జీవితాలను సినిమాగా మార్చి చాలా అద్భుతంగా తెరకెక్కించారన్నారు. కబ్జాలు చేసే గుండాలను ఎదిరించేందుకు ప్రజల పక్షాన నిలబడిన క్రమంలో గుండాగా మారిన మురళి ప్రజానాయకుడిగా ఎదిగాడన్నాడు. కొండా సినిమా కోసం రామ్‌గోపాల్‌ వర్మ చాలా కష్టపడ్డారని ప్రశంసించారు. హీరో త్రిగుణ్‌, హీరోయిన్‌ ఇర్రా మోర్‌ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events