యూత్‌పుల్ డ్రామాగా రూపుదిద్దుకోబోతోన్న చిత్రం రైస్‌మిల్. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బ్రహ్మాజీ పోలోజు దర్శకుడిగా పరిచయం అవుతుండగా, సిఎమ్ మహేష్, బి రాజేష్ గౌడ్ నిర్మించనున్నారు. సుధాకర్ విశ్వనాధుని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు. పూజా కార్యక్రమానికి చిన్నపరెడ్డి, చండి ప్రసాద్, అంకయ్య, శ్రీనివాస్ గుప్తా, శ్రీనివాస్ పవన్ కుమార్ తదితరులు హాజరై టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. హేమంత్ కుమార్, చైతన్య అరుణ్, జూనియర్ రాజనాల, శాంతి ప్రధాన తారాగణం. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ రైస్ మిల్ గ్రామీణ జీవితానికి, పట్టణ జీవితానికి మధ్య తేడాని సినిమాలో ప్రధానాంశం. చరణ్ అర్జున్ మ్యూజిక్ అందిస్తున్నారు అని తెలిపారు. హీరో హేమంత్ కుమార్ మాట్లాడుతూ హీరోగా ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ దాదాపు సంవత్సరం నుండి ఈ టీమ్‌తో ట్రావెల్ అవుతున్నాను. ఈ సినిమాకు సంగీతం ఇచ్చేందుకు నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్నాను అని తెలిపారు.