ధ్రువ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం కిరోసిన్. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మాతలు. మిస్టరీ కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంంచాలకుడు మామిడి హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్రువ మాట్లాడుతూ మిస్టరీ కథే అయినా అన్ని రకాల అంశాలు ఇందులో మిళితమయ్యాయి. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందన్నారు. నిర్మాత దీప్తి కొండవీటి మాట్లాడుతూ అందరికీ థ్రిల్‌ని పంచే చిత్రమిది. దర్శకుడు కాన్సెప్ట్ చెప్పగానే నిర్మించడానికి సిద్ధమయ్యాం. తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఓ కొత్త రకమైన సినిమాని ఆస్వాదిస్తారన్నారు. మేం ఆశించిన రీతిలో సినిమా ఔట్ పుట్ వచ్చింది. మిస్టర్ మూవీ అయినా మిగతా వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో నటులు సమ్మెట గాంధీ, లక్ష్మణ్ మీసాల తదితరులు పాల్గొన్నారు.