ఒక దేశం, రెండు వ్యవస్థలు అన్న విధానాన్ని కట్టుబడి ఉన్నట్లు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తెలిపారు. బ్రిటన్ నుంచి హాంగ్‌కాంగ్‌ను చైనా అప్పగించి 25 ఏళ్లు అవుతోంది.ఈ నేపథ్యంలో హాంగ్ కాంగ్‌ను జిన్ పింగ్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆ మోడల్ ప్రకారమే హాంగ్ కాంగ్ నగరాన్ని రక్షిస్తున్నామని, ఇది సుదీర్ఘ కాలం కొనసాగుతుందని తెలిపారు. హాంగ్ కాంగ్‌లో చైనా ఆధిపత్యాన్ని ఆయన సమర్ధించుకున్నారు. ఒక దేశం రెండు వ్యవస్థల వల్ల హాంగ్ కాంగ్‌కు స్వేచ్ఛ లభిస్తుందని, భావ స్వేచ్ఛను రక్షిస్తుందన్నారు. చైనాలో లేని హక్కుల్ని ఇక్కడ పొందవచ్చు అని తెలిపారు.














