బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై ప్రుమఖ నటి, షీ`హల్క్ వెబ్ సిరీస్ స్టార్ జమీలా జామిల్ బూతులతో రెచ్చిపోయింది. ఆయన ప్రభుత్వం ప్రజలను అణగదొక్కాలని చూస్తోందని మండిపడిరది. రిషి సునాక్ సంపన్న వర్గానికి చెందిన వాడని, మితవాది అని అన్నారు. అదృష్టం కొద్ది రిషి ప్రధాని అయ్యాని ధ్వజమెత్తింది. ఇంగ్లీష్ భాషలో బూతు పదంతో తీవ్ర విమర్శలు చేసింది. బ్రిటన్‌లో ప్రజలు నిరసనలు, ఆందోళనలు చేపట్టకుండా కొత్త చట్టాన్ని తీసుకురావాలని రిషి సునాక్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేయాలని రిషి సునాక్ చూస్తున్నారని జమీలా జామిత్ మండిపింది. ఇది నాయకత్వం కాదు నియంతృత్వం అని ధ్వజమెత్తింది.