ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్ లో మళ్లీ రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. భారతీయ సంతతి ఎంపీ రిషి సునాక్ ఈసారి కూడా ప్రధాని రేసులో ఉన్నారు. కన్జర్వేటివ్ ఎంపీ రిషి సునాక్ ప్రధాని అయ్యేందుకు కావాల్సిన అర్హతలను అందుకున్నారు. ఇప్పటికే ఆయనకు వంద మంది ఎంపీలు మద్దతు తెలిపారు. అయితే రిషి సునాక్ ఆ కీలక మైలురాయిని దాటేశారు. దీంతో ఆయన బ్రిటన్ ప్రధాని రేసులో మందంజలో ఉనన్నట్లు తెలుస్తోంది.
మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి పోటీ చేయనున్నట్లు తెలిపారు. బ్రిటన్ ప్రధాని పదవికి పోటీపడుతున్నట్లు ఇప్పటికే క్యాబినెట్ సభ్యురాలు పెన్నీ మోర్డాంట్ ప్రకటించారు. బోరిస్ జాన్సన్‌కు ఇప్పటి వరకు 44 మంది మద్దతు ఇచ్చారు. పెన్నీ మోర్డాంట్‌కు 21 మంది మద్దతు ఉంది. అయితే ఇప్పటి వరకు సునాక్ లేదా జాన్సన్ అధికారికంగా ప్రచారం మొదలు పెట్టలేదు. కానీ వాళ్లకు మాత్రం టోరీ పార్టీ ఎంపీలు మద్దతు ముందే ప్రకటించారు.