బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న కన్సర్వేటిట్ పార్టీలో జరిగిన పోటీలో దేశ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ పై చేయి సాధించినట్లు తెలుస్తోంది. ఈ రేసులో ఆమె ప్రత్యర్థి భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ వెనుకబడ్డారు. వీరిద్దరిలో విజేతను తేల్చడానికి జరిగిన ఎన్నికల ఎన్నికలు శుక్రవారం సాయంగ్రం ముగిశాయి. ఫలితాలను సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రకటిస్తారు. అనంతరం ప్రస్తుత ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ బ్రిటిష్ రాణి రెండో ఎలిజబెత్‌ను కలిసి తన పదవికి రాజీనామా సమర్పిస్తారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన లక్షా 60 వేల మంది క్రియాశీల సభ్యుల్లో అధిక శాతం మంది లిజ్ ట్రస్ వైపు మొగ్గు చూపినట్లు ప్రాథమిక సర్వేలు స్పష్టం చేశాయి. దీంతో ఆమె ప్రత్యర్థి రిషి సునాక్ ఓటమి పాలుకావటం తథ్యమని తెలుస్తోంది. సునాక్‌కు కన్జర్వేటివ్ పార్లమెంటు సభ్యుల మద్దతు లభించగా, పార్టీ క్రియాశీల సభ్యులు ట్రస్ వైపు మొగ్గు చూపారు. వీరంతా ఆగస్టు నెల మొదటి నుంచి తపాలా ద్వారా, ఆన్‌లైన్‌లోనూ ఈ నెల 2వ తారీఖు వరకూ ఓటుహక్కును వినియోగించుకున్నారు