రవివర్మ, రోహిత్ బెహల్, అక్షత సోనవానె ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ప్రత్యర్థి. శంకర్ ముడావత్ దర్శకుడు. సంజయ్ సాహ నిర్మాత. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఇదొక కొత్తతరహా సస్సెన్స్ థ్రిల్లర్. ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో పాటు ఆసక్తికరమైన ట్విస్ట్‌లు కూడా ఉంటాయి అన్నారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఓ మిస్సింగ్ కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి చనిపోవడంతో పాటు, ప్రత్యర్థి ఎవరనే విషయాలు ఈ కథలో కీలకం. ప్రేక్షకుల అంచనాల్ని మించిన మలుపులు ఉంటాయి. ట్రైలర్‌కి చక్కటి స్పందన లభిస్తోంది. చిత్రం కూడా తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందన్నారు. ఈ నెల 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం, కూర్పు: రాకేష్ గౌడ్, సంగీతం : పాల్ ప్రవీణ్.