తమిళ అగ్ర హీరో సూర్య సూర్య లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన విక్రమ్ చిత్రంలో మాఫియా డాన్ రోలెక్స్గా సూర్య అతిథి పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఈ పాత్ర ఆధారంగా ఓ పూర్తి స్థాయి సినిమాకు దర్శకుడు లోకేష్ కనకరాజ్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ మీట్లో పాల్గొన్న సూర్య రోలెక్స్ చిత్రంపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నా. రోలెక్స్ పాత్ర ఆధారంగా చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నా లైనప్లో ఈ సినిమా కూడా ఉంది అన్నారు. ఈ వ్యాఖ్యలతో లోకేష్ కనకరాజ్-సూర్య సినిమా విషయంలో స్పష్టత వచ్చిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)