అదిరే అభి, వాణి, తల్లాడ సాయికృష్ణ, నేహా, నందకిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వైట్ పేపర్. ఈ చిత్రానికి శివ దర్శకుడు. గ్రంధి శివ ప్రసాద్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ నటి, ఎమ్మెల్యే రోజా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక సినిమాను కేవలం పది గంటల్లో చేయడం అంటే మాములు కాదు. ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని కృషిని అందరూ అభినందించాలి అని పేర్కొన్నారు. రొటీన్‌కు భిన్నమైన మంచి కథను ఎంచుకుని సినిమా తీసిన శివ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అభి హీరోగా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా అన్నారు. హీరో అభి మాట్లాడుతూ నాలుగు కెమెరాలతో పది గంటల్లో సినిమా చేశాం. ఓ ఫోన్ బూత్ నేపథ్యంలో ఒకే లొకేషన్‌లో జరిగే కథ ఇది. మా ప్రయత్నానికి మెచ్చి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు సత్కరించారన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీకర్, జర్నలిస్ట్ ప్రభుతో పాటు జబర్దస్త్ టీమ్ గెటప్ శ్రీను, రాఘవ, హైపర్ ఆది, సాయి రాజేష్, రమేష్, లోబో తదితరులు పాల్గొన్నార.