Skip to main content

Namaste NRI

రోటి కపడా రొమాన్స్ … రిలీజ్ ఎప్పుడంటే?

హర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, తరుణ్‌, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్‌, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం రోటీ కపడా రొమాన్స్‌. విక్రమ్‌రెడ్డి దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్‌, సృజన్‌ కుమార్‌ బొజ్జం నిర్మాతలు. తొలుత ఈ సినిమాను ఈ నెల 22న విడుదల చేయాలనుకున్నారు. ఆ డేట్‌లో థియేటర్లు దొరకని కారణంగా సినిమా విడుదలను ఈ నెల 28కి వాయిదా వేశారు. తెలుగు రాష్ర్టాల్లోని ప్రధాన నగరాల్లో ఈ నెల 22 నుంచి ఈ సినిమా పెయిడ్‌ ప్రీమియర్లను ప్లాన్‌ చేశామని మేకర్స్‌ తెలిపారు. ఇంకా మాట్లాడుతూ ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ఉత్తమ ఫీల్‌గుడ్‌ మూవీ ఇది. యువతరం మెచ్చేలా సినిమా ఉంటుంది. ఇప్పటికే వేసిన షోలకు మంచి స్పందన వస్తున్నది  అని చెప్పారు.

Social Share Spread Message

Latest News