దేశంలోనే కాదు అంతర్జాతీయ వేదికలపైనా సత్తా చాటుకున్న ఆర్‌ఆర్‌ఆర్ మరో ఘనత దక్కించుకుంది. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషన్ అవార్డులను గెలుచుకున్న ట్రిపుల్‌ఆర్ ఇప్పుడు ఆస్కార్‌పై కన్నేసింది. ఓరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్‌ఆర్‌ఆర్ నుంచి నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఈ వేడుక మార్చి 12న ఘనంగా జరుగనుండగా నాటు నాటు పాటను లైవ్ లో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఆస్కార్ అకాడమీ నిర్వాహకులు ట్వీట్ చేశారు. మార్చి 12న జరిగే ఆస్కార్ వేడుకలో సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఈ పాటకు లైవ్ పర్‌ఫార్మెన్స్ ఇస్తారని అకాడమీ వెల్లడించింది. దీంతో తెలుగు సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆస్కార్ వంటి గొప్ప వేదికపై మనవాళ్లు లైఫ్ ప్రదర్శన ఇవ్వడం నిజంగా తెలుగు వారందరికీ గర్వకారణం. ఈ విషయంపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇది తన జీవితంలో మర్చిపోలేని సందర్భం అని, ఆ క్షణాల కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు. దీంతో తెలుగు సినీ ప్రేక్షకులు ఖుషీ అవుతున్నారు.