Namaste NRI

ఆర్ఆర్ఆర్  సంచలనం.. నాటునాటుకు ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చరిత్ర సృష్టించింది.  ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును ఆర్‌ఆర్‌ఆర్‌ సొంతం చేసుకుంది.  ఒరిజినల్‌ సాంగ్‌ విభాగానికి గానూ ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి నాటు నాటు పాటకు పురస్కారం వరించింది. ఈ మేరకు కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్‌ హాల్‌ వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవంలో రాజమౌళి, చరణ్‌, ఎన్టీఆర్‌, కీరవాణి కుటుంబ సమేతంగా పాల్గొని సందడి చేశారు. నాటు నాటు కు పురస్కారం ప్రకటించిన సమయంలో తారక్‌,  రాజమౌళి, చరణ్‌ చప్పట్లు కొడుతూ సందడి చేశారు.

ఈ సందర్భంగా  మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి మాట్లాడుతూ  దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటునాటు పాటకు ప్రఖ్యాత గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రతిష్ఠాత్మక అవార్డు ఇచ్చిన హెచ్‌ఎఫ్‌పీఏకు ధన్యవాదాలు తెలిపారు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు తన సోదరుడికి దక్కాలని చెప్పారు. పాటలో భాగమైన రాహుల్‌ సిప్లిగంజ్‌కు ధన్యవాదాలు తెలిపారు. పాటకు కాళభైవర అద్భుత సహకారం అందిచారన్నారు. తన శ్రమను, తనకు మద్దతు ఇచ్చినవారిని నమ్ముకున్నానని వెల్లడించారు. సంతోష సమయాన్ని తన భార్యతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.

సంగీత దర్శకుడు కీరవాణి తన సోదరుడు రాజమౌళి చిత్రం అంటే ఎప్పటికి నిలిచిపోయేలా మ్యూజిక్‌ అందిస్తుంటారు. పాటలపైనే కాకుండా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ స్కోర్‌ (బీజీఎం) కూడా అదిపోయాలా చేస్తారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆయన అందించిన సంగీతం, బీజీఎం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాటు నాటు పాట దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరిని ఆకట్టుకోవడమే దీనికి ఉదాహరణ. చంద్రబోస్‌ సాహిత్యానికి కీరవాణి సంగీతం తోడవగా, రాంచరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ఈ పాటకు మరింత క్రేజ్‌ను తీసుకొచ్చాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events