అమెరికాలో ఏకంగా రూ.10,716,18 కోట్లు ( 134 కోట్ల డాలర్లు) గెలుచుకున్న వారు మాత్రం తాము లాటరీ నంబర్‌ను చెక్ చేసుకోలేదు. ఒకటీ రెండు రోజులు కాదు ఏకంగా నెల రోజులు అవుతున్నా ఎవరూ ముందుకు రాలేదు. దీనితో లాటరీ గెలుచుకున్నవారు త్వరగా ముందుకు రావాలని కోరుతూ ఆ కంపెనీ ప్రకటన కూడా జారీ చేయవలసి వచ్చింది. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో మెగా మిలియన్స్ లాటరీ నిర్వహిస్తుంటారు. జూలై 29న ఏకంగా 134 కోట్ల డాలర్లు విలువ చేసే లాటరీ తీశారు. బహుమతి గెలుచుకున్న లాటరీ టిక్కెట్ల నంబర్లను ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఆ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేసినవారు లాటరీ నిర్వాహకులను సంప్రదించలేదు. దీనితో విజేతలు తమను సంప్రదించాలంటూ ఇల్లినాయిస్ లాటరీ డైరెక్టర్ హరోల్డ్ మేస్ ప్రకటించారు. ఈ లాటరీ గెలుచుకున్న నవంబర్ల సీరిస్ 13, 36, 45, 57, 67, 14 అని షికాగో నగర శివార్లలోని ఒక పెట్రోల్ బంక్‌లో ఈ లాటరీ టిక్కెట్ అమ్ముడైందని ఆయన తెలిపారు. అమెరికాలో ఏ లాటరీకైనా విజేతలు బహుమతి క్లెయిమ్ చేసుకోవడానికి రెండు నెలల వరకు మాత్రమే సమయం ఉంటుంది. అయితే మెగా మిలియన్ లాటరీకి మాత్రం 180 రోజులు గడువు ఉంటుంది. అమెరికా చరిత్రలో విలువైన లాటరీల్లో ఇది మూడవది కావడం మరొక విశేషం.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)