Namaste NRI

రూ. 2.5 కోట్లు పలికిన జాబ్స్ అప్లికేషన్

స్టీవ్‌ జాబ్స్‌ సక్సెస్‌కు మారుపేరుగా మనకు తెలిసిన వ్యక్తి. యాపిల్‌ సంస్థను స్థాపించి ప్రపంచంలోనే అత్యంత మన్నికైన, ఖరీదైన బ్రాండ్‌ గా నిలిపారు. మరి, అంతకుముందు ఆయన జీవితమేంటి? పేరులో జాబ్స్‌ ఉంది. సరే ఆయన వేరే కంపెనీల్లో జాబ్‌ చేశాడా? అంటే ఆయన తన జీవితంలో పెట్టుకున్న ఒకే ఒక్క దరఖాస్తును అడిగితే చెబుతుంది. అవును, 18 ఏళ్ల వయసులో ఆయన ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. యాపిల్‌ స్థాపనకు మూడేళ్ల ముందు స్వదస్తూరితో 1973లో ఆ అప్లికేషన్‌ పెట్టుకున్నారు. జాబ్స్‌ పెట్టుకున్న ఆ ఒకే ఒక్క జాబ్‌ అప్లికేషన్‌ను తాజాగా స్టీవ్‌ జాబ్స్‌ స్నేహితులు ఫిజికల్‌, వెబ్‌ పేజ్‌ రూపంలో గత వారం వేలం వేశారు.

                ఫిజికల్‌ దరఖాస్తు 3.43 లక్షల డాలర్లకు (సుమారు రూ.2.5 కోట్లు) ఆ అప్లికేషన్‌ అమ్ముడుపోయింది. అది ఓ చిన్న పేపర్‌ ముక్కే కావొచ్చు. గానీ ఎంత మందికి స్ఫూర్తిగా నిలిచిన ఆయన దరఖాస్తు అనేసరికి అంతరేటు పలికింది. ఆ జాబ్‌ దరఖాస్తులో తనకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉందని, కానీ ఫోన్‌ మాత్రం లేదని జాబ్స్‌ పేర్కొన్నారు. రవాణా సౌకర్యాలు సాధ్యమే కానీ, కుదరకపోవచ్చంటూ రాశారు. అయితే. ఈ జాబ్‌ అప్లికేషన్‌ కు వేలం జరగడం ఇదే మొదటి సారి కాదు. గతంలో మూడు సార్లు దానిని వేలానికి పెట్టారు. ఆ మూడూ సార్లూ దాని ధర పెరుగుతూనే పోయింది. తొలిసారిగా 2017లో న్యూయార్క్‌లో వేలం వేశారు. ఈ ఏడాది మార్చిలోనూ లండన్‌ లో వేలం నిర్వహించగా రూ.1.7 కోట్లు పలికింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events