ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో వచ్చే వారం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జమ్‌బూరీ మైదాన్‌లో నిర్వహించే జన్ జాతీయ గౌరవ్ దివాస్ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా జాప్ఞకార్థం గిరిజనులు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సమావేశంలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభకు మధ్యప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న గిరిజనులను తరలించేందుకు రూ.13 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. పర్యటనలో భాగంగా మోదీ హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్‌ను జాతికి అంకితం చేయనున్నారు. దేశంలోనే తొలిసారిగా పబ్లిక్, ప్రయివేటు పార్ట్నర్షిప్లో ఈ స్టేషన్‌ను నిర్మించారు.














