నటుడు, దర్శకుడు కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న చిత్రం రుద్రుడు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. శరత్‌కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రాన్ని దర్శకుడు కతిరేసన్ రూపొందిస్తున్నారు. చెడ్డవాళ్లు పుట్టరు, తయారు చేయబడతారు అనే క్యాప్షన్‌ను పెట్టారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించారు. డిసెంబర్ 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడిరచారు. తెలుగు, తమిళ్, కన్నడ భాషలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో లారెన్స్ చేతిలో సీరియస్‌గా చూస్తు ఆసక్తికరంగా కనిపించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ రాఘవ లారెన్స్ సినిమాలకో ప్రత్యేకత ఉంటుంది. హీరోయిజం, మంచికథతో ఆయన చిత్రాలు తెరకెక్కుతుంటాయి. ఈ సినిమాలో మంచి యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. లారెన్స్ క్వారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్డీ రాజశేఖర్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్.
