అనిల్, విభీష, రియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రుద్రంకోట. రాము కోన దర్శకత్వంలో అనిల్ కండవల్లి నిర్మిస్తున్నారు. హీరో, నిర్మాత అనిల్ కండవల్లి చిత్ర విశేషాలు తెలియజేస్తూ భద్రాచలం దగ్గరలోని రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో జరిగే కథ ఇది. శ్మశాన వాటికలో పెరిగి పద్దైన ఓ యువకుడి జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని సరికొత్త పాయింట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ ప్రముఖులు యుబైఏ సర్టిఫికెట్ తో పాటు సినిమా బావుందంటూ ప్రశంసించారు. మా సినిమా నచ్చడంతో స్క్రీన్ మాక్స్ పిక్చర్స్ వారు విడుదల చేయడానికి ముందుకొచ్చారు. సెప్టెంబర్ 22న వరల్డ్ వైడ్ గా సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనున్నాం అన్నారు. ఈ చిత్రంలో జయలలిత, అలేఖ్య, రమ్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సంజీవ్, సంగీతం: సుభాష్ ఆనంద్, నిరంజన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాము కోన.
