Namaste NRI

రుద్రవీణ ప్రీరిలీజ్‌  ఈవెంట్‌

రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల సినిమాస్‌ పతాకంపై శ్రీరామ్‌, ఎల్సా, శుభశ్రీ హీరో హీరోయిన్లుగా మధుసూదన్‌ రెడ్డి దర్శకత్వంలో రాగుల లక్ష్మణ్‌, రాగుల శ్రీను సంయుక్తంగా నిర్మించిన చిత్రం రుద్రవీణ.  ఈ చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్‌, టీజర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. నిర్మాత రాగుల లక్ష్మణ్‌ మాట్లాడుతూ  ఇందులో ముగ్గురు అమ్మాయిలు చాలా కష్టపడి  చేశారన్నారు. రఘు కుంచె అద్భుతమైన నటన కనబర్చారన్నారు.  హీరోకు ఈ సినిమాతో మంచి పేరొస్తుందని అన్నారు. కొత్తగా మనం ఎప్పుడూ చూడని కథత ఇందులో ఉంటుందని, సినిమా  చాలా బాగా వచ్చిందన్నారు.  మా అమ్మగారి నిర్మాణంలో ఈ సినిమా తీశాం అన్నారు రాగుల శ్రీను. రుద్ర వీణ కథ విని చాలా ఎగ్జయిట్‌ అయ్యాను. ఇందులో విలన్‌ క్యారెక్టర్‌ చేశాను నా లుక్‌ను బాగా డిజైన్‌ చేశారు అన్నారు రఘు కుంచె. ఈ కార్యక్రమంలో మరో నిర్మాత రాగుల శ్రీను, నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె, చిత్ర దర్శకుడు మధుసూదన్‌ రెడ్డి, హీరో శ్రీరామ్‌ నిమ్మల హీరోయిన్స్‌ ఎల్సా, శుభశ్రీ, జగదీష్‌, గెటప్‌ శ్రీను, శ్రీని ఇన్ప్రా శ్రీను  తదితరులు పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events