వరుణ్‌తేజ్ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. శక్తిప్రతాప్‌సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. ఇందులో వరుణ్ ఐఏఎఫ్ అధికారిగా నటిస్తుండగా, రాడార్ ఆఫీసర్ గా మానుషి చిల్లర్ కనిపించనున్నది. మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్న రుహానీశర్మ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమాలో ఆమె పేరు తాన్యశర్మ. ఆ పాత్ర లుక్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. ఎయిర్‌ఫోర్స్ పైలెట్ యూనిఫాంలో డైనమిక్‌గా ఆమె ఈ లుక్‌లో కనిపిస్తున్నదని, సినిమాలో పాత్ర కూడా అదే స్థాయిలో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. దేశం కోసం వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాన్ని ఆపరేషన్ వాలెంటైన్ చూపించబోతున్నామని వారు తెలిపారు. మార్చి 1న ఈ సినిమా విడుదల కానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)