రష్యా బుధవారం (16వ తేదీ)న ఉక్రెయిన్‌పై దాడికి దిగే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఆయన దేశం విడిచి వెళ్లిన ప్రభుత్వ అధికారులంతా 24 గంటల్లో తిరిగి రావాలని కోరారు. ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి రష్యా అదనపు బలగాలను మోహరిస్తుండగా, సరిహద్దుల్లో వేర్పాటువాదుల దాడులు పెరిగాయని జెలెన్‌స్కీ వెల్లడిరచారు. ఓ వైపు దౌత్య మార్గాలు, మరో వైపు సైనిక ఒత్తిడిని రష్యా కొనసాగిస్తున్నది. రష్యా నుంచి దాడి జరిగితే ఎదుర్కొనేందుకు సరిహద్దులోని ప్రజలకు ఉక్రెయిన్ శిక్షణ ఇస్తున్నది. అయితే ఉక్రెయిన్, మాజీ సోవియట్ దేశాలను నాటోలో చేర్చుకోవద్దని, అలాగే తూర్పు ఐరోపా నుంచి నాటో కూటమి బలగాలు వెనక్కి వెళ్లాలని సూచిస్తున్నది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)