రష్యాకు చెందిన క్షిపణి పరీక్షలతోసహా అణ్వాయుధ సమాచారాన్ని అమెరికాకు ఇచ్చిపుచ్చుకునే పద్దతిని ఆపేసినట్టు రష్యాకు చెందిన సీనియర్ దౌత్యవేత్త వెల్లడించారు. అమెరికాతో అణ్వాయుధాల ఒప్పందం నుంచి ఇదివరకు తప్పుకున్న తరువాత ఈమేరకు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ఆపేసినట్టు మంత్రి వివరించారు. ఉక్రెయిన్లో రష్యా ఓటమే తమ లక్షంగా అమెరికా దాని నాటో మిత్ర దేశాలు బహిరంగంగా ప్రకటించిన తరువాత గత నెల రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వాయుధాలకు సంబంధించిన కొత్త ఒప్పందం రద్దు చేశారు. ఈ ఒప్పందం మేరకు తమ అణ్వాయుధ క్షేత్రాలను అమెరికా పరీక్షించడానికి రష్యా ఏమాత్రం ఒప్పుకోదని స్పష్టం చేశారు. అయితే ఒప్పందం నుంచి మొత్తం వైదొలగడం కాదని, అణ్వాయుధాల పరిమితిని తాము గౌరవిస్తామని రష్యా పేర్కొంది. అయితే బాలిస్టిక్ క్షిపణులను ఒక ప్రణాళిక ప్రకారం పరీక్షించే ముందు మాత్రం ప్రాథమిక సమాచారం అమెరికాకు తెలియజేస్తామని మంత్రి తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/41766551-9753-415b-b545-44b631521b31-36.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/f45ad641-4a72-48bc-b72d-4f37995c2771-68.jpg)