ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. 100 రోజులు దాటి కూడా రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతంపై రష్యా భీకర దాడులు చేస్తోంది. విధ్వంసం భారీ స్థాయిలో ఉన్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. రష్యా సైన్యం చేస్తున్న బాంబు దాడులతో తూర్పు ఉక్రెయిన్ నగరాలన్నీ శిథిలాలవుతున్నాయి. సివెరొడెనస్కీ నగరంపై రష్యా ఏకధాటిగా దాడి చేస్తోంది. అయితే మాక్సర్ టెక్నాలజీస్ సంస్థ హై రెజల్యూషన్ ఇమేజ్లను తీసింది. కేవలం 24 గంటల్లోనే భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సివెరొడెనస్కీలో బిల్లింగ్లు, హాస్పిటల్తో పాటు పలు ప్రాంతాలన్నీ ధ్వంసం అయ్యాయి. ఇక ఆకాశం నుంచి చూస్తే అక్కడో భారీ రంధ్రం ఏర్పడినట్లే కనిపిస్తోంది. డోవ్హెంకీలో సుమారు 40 మీటర్ల వెడల్పు ఉన్న భారీ గొయ్యి ఏర్పడినట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. సివెరొడెనస్కీ పారిశ్రామిక నగరం. ఒకవేళ ఆ నగరాన్ని రష్యా చేజిక్కించుకుంటే అప్పుడు మిగితా ప్రాంతాలను అధీనం చేసుకోవడం సులువవుతుంది రష్యా భావిస్తుంది.














