భారత వైఖరిని రష్యా ప్రశంసించింది. రష్యా` ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత్ చూపించిన సమతౌల్యం, సైద్ధాంతిక దృక్కోణం, స్వతంత్ర విధానాన్ని స్వాగతిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ మేరకు భారత్‌లో రష్యా రాయబారి తెలిపారు. యూఎన్ భద్రతా మండలి వేదికగా భారత్ మాట్లాడుతూ శాంతి మార్గాలతో పాటు దౌత్యం ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. అలాగే ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలను పెంచే ఏ చర్యనైనా అంగీకరించవద్దని, నిరోధించాలని భారత్ సూచించింది. ఈ వ్యాఖ్యలపై రష్యా స్పందించింది. భారత్ సమతౌల్యం, సిద్ధాంతాలను తాము ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.
